టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు నిర్మాతల హీరోగా పేరుంది. పారితోషికం ఆలస్యంగా ఇచ్చినా రామ్ చరణ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టరని ఇండస్ట్రీలో చరణ్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అభిమానులకు గౌరవం ఇచ్చే స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. తాజాగా రామ్ చరణ్ ఒక అభిమాని విషయంలో స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ఒక పాత్రలో పొలిటీషియన్ గా మరో పాత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా చరణ్ కనిపిస్తారని సమాచారం. చరణ్ శంకర్ కాంబో మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ అభిమాని ఒకరు చరణ్ ను కలవడానికి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. చరణ్ కు కలిసిన అభిమాని తన శరీరంపై చరణ్ పేరుతో వేయించుకున్న టాటూలను చూపించారు.
అభిమాని చరణ్ వచ్చే వరకు వేచి చూడగా చరణ్ ఫ్యాన్ ను కలిసిన వెంటనే ప్రేమగా పలకరించారు. ఆ తర్వాత ఫ్యాన్ తాను తినలేదని చెప్పగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. అభిమానికి ఆహారం అందజేయాలని చరణ్ తన సిబ్బందికి వెంటనే సూచించారు. అభిమానితో కలిసి ఫోటోలను దిగి చరణ్ అభిమాని సంతోషానికి కారణమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు నెల రోజుల గ్యాప్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఈ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఏడాది చరణ్ ఈ రెండు సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.