రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అతను అద్భుతంగా నటించాడు. అతని లుక్ కానీ యాక్షన్ సన్నివేశాల్లో అతను కనపరిచిన నటన కానీ అద్భుతం అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో మరో హీరో ఎన్టీఆర్ ను కూడా డామినేట్ చేసేంతలా నటించాడు. క్లైమాక్స్ లో అయితే ఎన్టీఆర్ కంటే రాంచరణ్ హైలెట్ అయ్యాడని చెప్పాలి. అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ చాలా కష్టపడి చేసినట్టు ప్రతీ ఒక్కరికీ అర్ధమైంది.
ఎన్టీఆర్ కు రాజమౌళి ఎన్ని ఎలివేషన్స్ పెట్టినా, నాటు నాటు పాటలో ఎన్టీఆర్ ఎంత స్పీడ్ గా డాన్స్ చేసినా చరణ్ గ్రేస్ ముందు అతను చాలా చిన్నగా కనిపిస్తాడు. ఎన్టీఆర్ తో పోటీపడి మరీ పైచేయి సాధించిన కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా అతను అభిమానులను సంపాదించుకున్నాడు.చరణ్ నటనని హాలీవుడ్ నటులు, డైరెక్టర్లు సైతం మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఓ హాలీవుడ్ రచయిత అయితే రామ్ చరణ్ కోసం ఓ కథ రాయాలని అనుకుంటున్నట్లు చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు.
అతను మరెవరో కాదు ‘ఆరన్ స్టీవర్ట్ ఆహ్న్’. ఇతను తన సోషల్ మీడియా ద్వారా పేర్కొంటూ.. ‘రామ్ చరణ్ లాంటి గొప్ప నటుడితో పనిచేయాలని ఉంది. ఆయన కోసం ఓ కథ రాస్తాను. ఒక వేళ ఆయన అంతర్జాతీయ ప్రొడక్షన్స్ లో పనిచేస్తున్నట్టు అయితే ఆయనే లీడ్ అయ్యుండాలి. కానీ హాలీవుడ్ అలా చెయ్యదు.
నేను భారతీయ సినిమాలను ఎప్పటికీ అభినందిస్తూనే ఉంటాను’ అంటూ ట్వీట్ చేశాడు. మరి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ తో ఈ హాలీవుడ్ రైటర్ పనిచేసే అవకాశాలు ఉంటాయేమో చూడాలి.