ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన ప్రేక్షకులలో కొంతమంది చరణ్ ను ఎన్టీఆర్ డామినేట్ చేశాడని చెబితే మరి కొందరు ఎన్టీఆర్ ను చరణ్ డామినేట్ చేశారని కామెంట్లు చేశారు. మరోవైపు స్క్రీన్ స్పేస్ విషయంలో తారక్ కు అన్యాయం జరిగిందని చివరి అరగంటలో చరణ్ ను జక్కన్న హైలెట్ చేశారని కొంతమంది తారక్ అభిమానులు మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మూడున్నరేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఇది కాదని మరి కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే తారక్ ఇప్పటికే ఈ కామెంట్ల గురించి స్పందించి తన వైపు నుంచి స్పష్టతనిచ్చారు. తాజాగా ముంబైలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరగగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ను చరణ్ డామినేట్ చేశారని మీడియా ప్రముఖుల నుంచి ప్రశ్న ఎదురైంది. చరణ్ కే ఆర్ఆర్ఆర్ విషయంలో ఎక్కువ మార్కులు పడ్డాయని జర్నలిస్ట్ నుంచి ప్రశ్న ఎదురు కాగా ఆ మాటను తాను అంగీకరించనని చరణ్ అన్నారు.
తాను ఎన్టీఆర్ ను డామినేషన్ చేశానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సినిమాలో ఉన్న రామరాజు, భీమ్ పాత్రలకు తాను, ఎన్టీఆర్ న్యాయం చేశామని చరణ్ చెప్పుకొచ్చారు. భీమ్ రోల్ లో తారక్ అద్భుతంగా నటించాడని చరణ్ కామెంట్లు చేశారు. తారక్ తో తన జర్నీ బాగుందని చరణ్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో ఛాన్స్ ఇచ్చిన జక్కన్నకు కృతజ్ఞతలు అని చరణ్ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్వాదించిన స్థాయిలో తాను మరే సినిమాను ఆస్వాదించలేదని చరణ్ చెప్పుకొచ్చారు.
చరణ్ ఇచ్చిన వివరణతో తారక్ అభిమానులు కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు వచ్చినట్టేనని చెప్పవచ్చు.