‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ – ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ చూస్తే ఎవరైనా చెప్పేయొచ్చు. నిజానికి ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ఇటీవల మనకు తెలిసింది. అంత స్నేహం ఎక్కడ కుదిరింది, ఏంటి అనేది తారక్, చరణ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. ఇటీవల ఆ స్నేహం గురించి ఇంకొంచెం ఎక్కువ విషయాలు బయటికొచ్చాయి. తామిద్దం భిన్న ధృవాలు లాంటి వాళ్లమని, అందుకే అంతగా కలసిపోయి స్నేహితులం అయ్యామని తారక్, చరణ్ చెప్పుకొచ్చారు.
అయితే స్నేహితుల మధ్య గొడవలూ సహజం అంటారు కదా… మీ మధ్య కూడా ఏవైనా గొడవలు వచ్చాయా అని ఇంటర్వ్యూ హోస్ట్ అనిల్ రావిపూడి అడిగారు. దానికి చరణ్ మాట్లాడుతూ పర్సనాలిటీ డిఫరెన్స్ వల్ల ఓ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ, గొడవల వరకు ఎప్పుడూ వెళ్లలేదని చెప్పాడు. ఏదైనా విషయాన్ని తాను కూల్‌గా, కంపోజ్డ్‌గా తీసుకుంటానని, అదే తారక్ అయితే కాస్త అగ్రెసివ్‌గా ఆ విషయాన్ని డీల్ చేస్తాడని చరణ్ చెప్పాడు.
అదే తనకు తారక్‌లో నచ్చే విషయం అని కూడా చెప్పాడు. ఇక తారక్ మాట్లాడుతూ చరణ్‌లో ఉండే కామ్‌నెస్ తనకు బాగా ఇష్టమని చెప్పాడు. వేర్వేరు మెంటాలిటీ వల్లనే తమ స్నేహం బలంగా ఉందని చెప్పాడు. మనసులో అగ్నిపర్వతం బద్దలైపోతున్నా… కంపోజ్డ్‌గా ఉంటాడు అంటూ చరణ్ గురించి చెప్పాడు తారక్. అదే తకు బాగా నచ్చిందని చెప్పాడు. స్టార్ క్రికెట్ సమయంలో తామిద్దరం కలసి వెళ్లామని అలా ఒకరికొకరు పరిచయమై, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి స్నేహితులుగా ఉన్నామన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్స్‌లో బాగా అలసిపోయినప్పుడు… ఈ రోజుకు ఆపేద్దాం అని తన మనసులో ఉంటుందని, అయితే ఆ విషయం తాను చెప్పను అని చరణ్ చెప్పాడు. కానీ తన మసులో మాట తారక్ చెప్పేస్తాడని అన్నాడు. ‘జక్కన్నా మమ్మల్ని వదిలేయ్… ఈ రోజుకి’ అంటాడట. అలా తన మనసులో మాట తారక్ నోట వచ్చేస్తుంది అని చరణ్ చెప్పాడు. దానికి తారక్ మాట్లాడుతూ I am his aggression and he is my calmness అని చెప్పాడు. మంచి బ్లెండ్ కదా. అందుకే ఆ స్నేహం.