మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. థర్డ్ వేవ్ రాకపోతే విడుదలవుతుంది లేదంటే మళ్ళీ కష్టమే అనే డిస్కషన్లు ఇండస్ట్రీలో జోరుగా జరుగుతున్నాయి.ఈ విషయాలను పక్కన పెట్టేసి పాజిటివ్ ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో చరణ్ కూడా ఉన్నాడని గుర్తిచేసుకోవాలి. సిద్ధ పాత్రలో అతను కనిపించబోతున్నాడు.
ఈ పాత్రకి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందని టీజర్ తో చెప్పకనే చెప్పారు. అయితే ఈ పాత్ర సినిమాలో ఎంతసేపు కనిపిస్తుందనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఈ విషయం పై స్వయంగా చరణే క్లారిటీ ఇచ్చాడు.చరణ్ మాట్లాడుతూ… ” ‘ఆచార్య’ లో నేను సిద్ధ పాత్రలో కనిపిస్తాను. ఆచార్య ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళే అగ్రెసివ్ కుర్రాడిగా నా పాత్ర ఉంటుంది. ఫస్టాఫ్ లో నా పాత్ర ఉండదు. సెకండాఫ్ లోనే నా పాత్ర ఎంట్రీ ఉంటుంది. నా పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాల వరకు ఉంటుంది.
సెకండాఫ్ అంతా నా పాత్ర ఉన్నట్టే అనిపిస్తుంది.మొదట నా పాత్ర తక్కువగానే ఉండేది. కానీ తర్వాత అన్ని విధాలుగా అలోచించి దాని నిడివి పెంచాల్సి వచ్చింది.ఈ విషయంలో కొరటాల ఏమాత్రం ఇబ్బంది పడలేదు.ఆయన నా పాత్రను మలిచిన తీరు గొప్పగా అనిపించింది. నాన్న గారితో కలిసి గతంలో రెండు, మూడు నిమిషాలు కనిపించాను. అయితే ఈసారి లెంగ్త్ ఉన్న రోల్ దక్కింది.కొన్ని సందర్భాల్లో ఆయనతో కలిసి నటించాలంటే భయమేసింది” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.