చెప్పినట్లుగానే కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేయని రామ్ చరణ్
- January 23, 2019 / 12:08 PM ISTByFilmy Focus
ఇకపై మహిళా ప్రధాన పాత్రలే చేయాలనుకుంటున్నాను, ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటాను అని హీరోయిన్లు చెప్పే డైలాగులు, మంచి కథ దొరికితే వేరే హీరోలతో కలిసి నటిస్తాను అని చెప్పే హీరోల మాటలను నమ్మడం చాలా కష్టం. కానీ.. చరణ్ మాత్రం తాను ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. “రంగస్థలం” విడుదలైన తర్వాత మీడియాతో ఒక సందర్భంలో మాట్లాడిన రామ్ చరణ్ ఇకపై తన సినిమాల పోస్టర్స్ మీద కలెక్షన్స్ కౌంట్ లేకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విన్నవాళ్ళందరూ మర్చిపోయారేమో కానీ.. చెప్పిన చరణ్ మాత్రం మర్చిపోలేదనుకుంటా.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అందుకే.. తన తాజా చిత్రం “వినయ విధేయ రామ” సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ మీద మాత్రమే కాక ప్రెస్ నోట్ లో కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఇది కూడా ఒకందుకు మంచిదే.. ఎందుకంటే ఈ కలెక్షన్స్ పోస్టర్స్ వచ్చే కొద్దీ అభిమానుల హడావుడి మొదలవుతుంది. ఇక ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి చెప్పాలా. ఇప్పుడు వినయ విధేయ రామ కలెక్షన్స్ పోస్టర్స్ రాకపోవడంతో ఈ గొడవలు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఈ పద్ధతిని ఇతర హీరోలందరూ కూడా ఫాలో అయితే బాగుండు.
















