రంగస్థలం 1985 లో ద్విపాత్రాభినయం చేయనున్న చరణ్?
- July 29, 2017 / 01:51 PM ISTByFilmy Focus
ధృవ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం 1985” సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్టూడియోలో 5 కోట్లతో వేసిన భారీ గ్రామీణ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 35 రోజులపాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుంది. చరణ్ తో పాటు సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న హీరోయిన్ సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రం గురించి తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు, ఇందులో ఒక పాత్రకు మూగ, చెవిటి లోపం ఉంటుందని ప్రచారం సాగుతోంది. గతంలో చరణ్ డ్యూయల్ రోల్ చేసిన మగధీర, నాయక్ .. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. మరి అదే సెంటిమెంట్ రంగస్థలం 1985 కి రిపీట్ అయ్యేలా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















