మరో మలయాళ సినిమా రీమేక్ రైట్స్ కొన్న రామ్ చరణ్
- February 18, 2020 / 12:49 PM ISTByFilmy Focus
రామ్ చరణ్ ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఏమిటి అనుకొంటున్నారా. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొన్న మాట వాస్తవమే కానీ.. అది మీరు అనుకుంటున్నట్లుగా కారు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ కాదండోయ్. మలయాళ చిత్రం “డ్రైవింగ్ లైసెన్స్”. ఇటీవల మలయాళంలో విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం “డ్రైవింగ్ లైసెన్స్”. పృధ్వీరాజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాక అన్నీ భాషల ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కోసం చరణ్ ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కొన్నాడని మాలీవుడ్ వర్గాల సమాచారం.

ఆల్రెడీ పృధ్వీరాజ్ నుండి “లూసిఫర్” రీమేక్ రైట్స్ కొన్న రామ్ చరణ్.. ఇప్పుడు అదే పృధ్వీరాజ్ నటించిన “డ్రైవింగ్ లైసెన్స్” రీమేక్ రైట్స్ కొన్నాడని చెప్పుకొంటున్నారు. ఒక స్టార్ హీరో మరియు అతడి అభిమాని నడుమ జరిగే ఆసక్తికరమైన పోరు నేపధ్యంలో ఇప్పటివరకూ తెలుగులో ఎలాంటి సినిమా తెరకెక్కలేదు. మరి ఈ మలయాళ రీమేక్ లో ఏ మెగాహీరో నటిస్తాడో చూడాలి.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

















