గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వారి పై సెటైరికల్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు వర్మ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అలాగే అతని అభిమానులను ఎక్కువగా కెలుకుతున్నాడు. ఏకంగా ‘పవర్ స్టార్’ అంటూ ఓ సినిమా కూడా తీసేసాడు వర్మ. మొన్నటి మొన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసాడు. 2019 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు స్పష్టమవుతుంది. ఇక జూలై 25 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు.
దీంతో పవన్ అభిమానులు వర్మ పై ప్రతీకారం తీర్చుకోవడానికి..నిన్న అతని ఆఫీస్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ ను డైరెక్ట్ గా కెలకడం ఇష్టం లేక కొంతమంది హీరోలు పవన్ ను సపోర్ట్ చేస్తూ.. పరోక్షంగా ట్వీట్లు వెయ్యడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. మొన్నటికి మొన్న నిఖిల్.. ‘పవన్ శికరం.. వర్మ శునకం’ అన్నట్టు ఓ ట్వీట్ వేశాడు. దానికి వర్మ….’ నిఖిల్ ఎవరో నాకు తెలీదు’ అంటూ అతన్ని అవమానించాడు. ఇదిలా ఉండగా..
ఇప్పుడు చరణ్ కూడా తన ఇన్స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘రంగస్థలం’ సినిమాలో తన చిట్టిబాబు లుక్ కు సంబందించిన ఫోటోని పోస్ట్ చేసి.. ‘కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను’ అంటూ కామెంట్ పెట్టాడు చరణ్. ఇది ఇండైరెక్ట్ గా వర్మ పై సెటైర్ వేసినట్టే అని స్పష్టమవుతుంది. ఇప్పుడు వర్మను కెలికి వాయించుకోవడం ఇష్టం లేక.. ‘కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను’ అంటూ చరణ్ చేతులు దులిపేసుకున్నట్టు స్పష్టమవుతుంది.