మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కలయికలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా రూపొందుతుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రానికి నిర్మాత. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil) , అంజలి (Anjali) , జయరాం (Jayaram) ,ఎస్.జె.సూర్య (S. J. Surya) వంటి స్టార్లు అందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. అన్నిటికీ మించి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత చరణ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఎప్పుడో 2021 లో షూటింగ్ ప్రారంభమైతే.. ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. అది పక్కన పెడితే కనీసం ఈ సినిమా గురించి అప్డేట్లు కూడా రావడం లేదు. దీంతో అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. అయితే ఇటీవల దిల్ రాజు స్పందించి.. ‘ఇంకో 4 ,5 నెలలు ఓపిక పట్టండి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులకి కొంత రిలీఫ్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇప్పట్లో అంత ఈజీగా కంప్లీట్ అవ్వదట.
షెడ్యూల్స్ అన్నీ గందరగోళంగా శంకర్ ప్లాన్ చేశారు. ‘ఇండియన్ 2 ‘ (Indian2) తో సమాంతరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత నెత్తినేసుకోవడంతో పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకోలేకపోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపితే తప్ప.. జూన్ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్సులు లేవు.
అందుకే చరణ్ కూడా అసహనానికి గురయ్యాడని తెలుస్తుంది. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కంప్లీట్ అయితే తప్ప బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమా షూటింగ్లో అతను జాయిన్ అవ్వడం కష్టం. అందుకే చరణ్ ఇలా డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది.