టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తైనా మిగతా 20 శాతం కోసం చాలా వర్కింగ్ డేస్ కేటాయించాల్సి ఉందని సమాచారం. 2024 సంవత్సరంలో గేమ్ ఛేంజర్ కచ్చితంగా విడుదల కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ కూడా త్వరలో మొదలుకానుంది. అయితే చరణ్, ఉపాసన తాజాగా మహారాష్ట్ర సీఎంను కలవడం హాట్ టాపిక్ అవుతోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను చరణ్, ఉపాసన కలవగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షిండే కుటుంబం నుంచి ఆహ్వానం అందడంతో చరణ్, ఉపాసన ఏక్ నాథ్ షిండే నివాసానికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారని సమాచారం. చరణ్, ఉపాసనలకు షిండే కొడుకు, కోడలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి షిండే చరణ్ కు వినాయక విగ్రహాన్ని అందజేశారని సమాచారం అందుతోంది.
షిండే కుటుంబ ఆతిథ్యం అద్భుతం అని ఉపాసన సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. వైరల్ అవుతున్న ఫోటోలలో చరణ్, ఉపాసనలను చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. చరణ్, ఉపాసనలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్, ఉపాసన కెరీర్ పరంగా మరింత సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చరణ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి.
గేమ్ ఛేంజర్ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకున్న (Ram Charan) రామ్ చరణ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రామ్ చరణ్ కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.