మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు. రామ్ చరణ్ కు సహజంగానే కాస్త భక్తి ఎక్కువ అన్న విషయం మనకు తెలిసిందే. ఈయన ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా దేవుళ్లను స్మరించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసి తనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని బయటపెడుతూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం మైసూర్ వెళ్లిన సంగతి తెలిసిందే.
చాలా రోజుల తర్వాత ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అనంతరం ఈ సినిమా ఓ కొలిక్కి రాబోతుందని తెలుస్తుంది. ఇక రాంచరణ్ కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొని ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టి వీలైనంత తొందరగా బుచ్చిబాబు సినిమా షూటింగ్ పనులలో కూడా పాల్గొనాలని భావిస్తున్నారు.
ఇన్ని రోజులు చరణ్ శంకర్ వారి వ్యక్తిగత కారణాల వల్ల సినిమాకు బ్రేక్ ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఈ సినిమా పనుల పైనే ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం మైసూర్లో షూటింగ్ జరుపుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈయనకు షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకగా మైసూర్ లోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లారని తెలుస్తోంది. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి రామ్ చరణ్ అనంతరం తిరిగి షూటింగ్ లోకేషన్ కి వెళ్ళిపోయారు.
ఇక రాంచరణ్ (Ram Charan) అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. అక్కడ ఆలయ అధికారులు ప్రధాన అర్చకులు రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.