రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం RC16 (RC 16 Movie) కోసం పూర్తిగా న్యూ వైబ్ లోకి మారడానికి సిద్దమవుతున్నాడు. (RRR) తరహా భారీ హిట్ తర్వాత, గేమ్ ఛేంజర్ (Game Changer). మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే, ఆ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఎఫెక్ట్ RC16 లోను చూపించాలని బుచ్చిబాబు (Buchi Babu Sana) భారీగా ప్లాన్ చేస్తున్నాడట. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పాత్రకు మాస్ షేడ్స్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాలోని మేజర్ హైలైట్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఇది చరణ్ పాత్రకు మరింత బలాన్ని ఇచ్చేలా డిజైన్ చేసారని, గేమ్ ఛేంజర్‌లోని ఫ్లాష్‌బ్యాక్ కంటే మాస్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ క్రికెట్, కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించనున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ ప్రారంభించిన టీమ్, త్వరలోనే భారీ సెట్స్‌లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనుంది.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, రామ్ చరణ్ మాస్ మూడ్‌ను చూపించేలా బిగ్ యాక్షన్ బ్లాక్స్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతుందని చిత్రయూనిట్ చెబుతోంది. బుచ్చిబాబు స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ను సినిమాలో ప్రధాన ఆయుధంగా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా విడుదల అనంతరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.