రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్’ సినిమా బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో అదరగొడుతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాను నాన్ ఫంజిబుల్ టోకెన్లగా అందుబాటలో ఉంచగా.. అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయని ఆయన వెల్లడించారు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డేంజరస్’ సినిమాను ప్రపంచంలోనే తొలిసారిగా నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్‌ఎఫ్‌టీ) పద్దతిలో రిలీజ్ చేస్తున్నట్లు గతవారంప్రకటించారు . మొత్తం ఆరు లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇందులో ఐదు లక్షలటోకెన్లు వేలానికి అందుబాటులో ఉంచి సినిమా యూనిట్ దగ్గర కేవలం లక్ష టోకెన్లు ఉంచుకున్నారు . తాజాగా ఐదు లక్షజాలా టోకెన్లు అమ్ముడైనట్లు వర్మ తెలిపారు. సినిమా యూనిట్ దగ్గరున్న లక్ష యూనిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దర్శకుడు వర్మ ఏ పని చేసినా.. అది సంచలనమయ్యేలా చేస్తుంటారు. ‘శివ’ సినిమాతో మేకింగ్ లెక్కలను మార్చేసిన ఆయన ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో సరికొత్త పంథాకు తేరా లేపారు.
గతంలో విష్ణుతో చేసిన ‘అనుక్షణం’ సినిమాను డిస్ట్రిబ్యూషన్ ని ఓపెన్ మార్కెట్ లో ఉంచారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘డేంజరస్’ సినిమాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అమ్మకానికి పెట్టారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!