ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆర్ జి వి ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న వివాదంపై తనదైన శైలిలో స్పందించారు.పరిశ్రమలో ప్రముఖుల మధ్య ఇగోలు సర్వసాధారణం అన్నారు. కాపోతే అందరూ పైకి మరొకరితో బాగున్నట్లు నటిస్తారు అన్నారు. తెరపైన మాత్రమే కాకుండా జీవితంలో నటించే వారు చాలా మంది ఉన్నారని ఆయన అసలు విషయం చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ హీరో మూవీ ప్లాప్ అయితే మరో హీరో రహస్య ప్రదేశాలలో పార్టీలు చేసుకుంటారు అన్నారు.
అంతెందుకు ఇంత వరకు ప్లాప్ ఎరుగని రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్లాప్ అయితే పండగ చేసుకొనేవారు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు అని ఆర్ జి వి కుండబద్దలు కొట్టారు. ఆర్ జి వి ఇంతే లే ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాడు అని కొట్టేపారేయలేం. తాజా పరిస్థితులను చూస్తుంటే ఈ కోల్డ్ వార్ ఎప్పటి నుండో నడుస్తుంది అనిపిస్తుంది. బాలయ్యకు చిత్ర పరిశ్రమకు సంబందించిన కీలక సమావేశాలలో ప్రాతినిధ్యం ఇవ్వకపోయే సరికి ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు.
ఇక్కడ సినిమా పరిశ్రమ సమస్యలు తీర్చిడం కంటే ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసమే ఈ కుమ్ములాట అనేది సుస్పష్టం. రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్నీ కొంచెం విడమర్చి చెప్పారు అంతే. టాలీవుడ్ నాలుగు కుటుంబాల ఆధిపత్యం మధ్యలో నలిగిపోతుంది అని అప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న దాసరి నారాయణరావు బహిరంగా చెప్పారు. చిన్న సినిమాను వీరు చంపేస్తున్నారు అని కూడా ఆయన ఆరోపణలు చేశారు.