ఆర్జీవీ ప్రకటన వెనుక అసలు కథ ఇదా..?

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జున సినీ కెరీర్ లో అత్యంత దారుణమైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఆఫీసర్ సినిమా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. అయితే ఆఫీసర్ సినిమా వల్ల ఆర్జీవీ కొత్త సినిమా డీ కంపెనీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో డీ కంపెనీ సినిమాను వాయిదా వేస్తున్నానని త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తానని ప్రకటన చేశారు. దావూద్ ఇబ్రహీం లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్జీవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేయడానికి ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కారణమని తెలుస్తోంది.

ఎఫ్‌డబ్య్లూఐసీఈ పేరుతో పిలిచే ఈ ఫెడరేషన్ డీ కంపెనీ సినిమా విడుదలను అడ్డుకోవాలని సంబంధిత విభాగానికి లేఖ రాసినట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, డ్రైవర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్ లకు మొత్తం 12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా చెల్లింపుల గురించి అడిగిన ప్రతిసారి వర్మ తన కొత్త సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఫెడరేషన్ సభ్యులు వెల్లడించడం గమనార్హం. ఆఫీసర్ సినిమా బకాయిలను చెల్లించే వరకు డీ కంపెనీ సినిమాను విడుదల చేయకూడదని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus