Ram Gopal Varma: యానిమల్ సినిమా అలాంటి అర్హత పొందలేదు!: వర్మ

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో రాంగోపాల్ వర్మ ఒకరు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు అయితే ఈ మధ్యకాలంలో సినిమాలపై వర్మ ఫోకస్ కాస్త తగ్గిందని చెప్పాలి ఎక్కువగా పొలిటికల్ బయోపిక్ సినిమాలను మాత్రమే ఫోకస్ చేస్తున్నారని చెప్పాలి. ఇకపోతే సాధారణంగా వర్మ ఏ సినిమాలకి తన రివ్యూ ఇవ్వరు అనే సంగతి మనకు తెలిసిందే కానీ ఈయన యానిమల్ సినిమాకు సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఇచ్చారు.

ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా చూసిన తర్వాత తనకు మైండ్ బ్లాక్ అయింది అంటూ సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ ప్రతిభకు ఈయన ఫిదా అయినట్లు వెల్లడించారు. ఇలా యానిమల్ సినిమాలోని ప్రతి ఒక్కరిపై కూడా ఈయన ఎంతో అద్భుతంగా పొగుడుతూ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఇలా రాంగోపాల్ వర్మ ఇలాంటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఇచ్చారు (Ram Gopal Varma) అంటే ఈ సినిమా ఆయనకు ఏ స్థాయిలో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చాలా అద్భుతంగా నటించారని తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అనిపించే విషయం ఏమిటంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ తప్ప మరెవరు నటించిన అంతగా సెట్ అవ్వదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందని ఈయన తెలియజేశారు కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పాత్రలో నటించే సత్తా కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే ఉంది అంటూ ఈయన విజయ్ దేవరకొండపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా కూడా ఇదే స్థాయిలోనే ఉందని చెప్పాలి దీంతో ఇలాంటి ఒక పాత్రలో నటించే క్యాపబిలిటీ కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే ఉందని వర్మ వెల్లడించారు అంతేకాకుండా యానిమల్ సినిమా సోషల్‌ యాస్పెక్ట్ లో ఇదొక పెద్ద డ్యామేజింగ్‌ ఫిల్మ్ అని, నేషనల్‌ అవార్డులు వంటి వాటికి ఇది సూట్‌ కాదంటూ, అర్హత సాధించలేదని ఆయన కామెంట్‌ చేయడం గమనార్హం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus