Ram, Balayya Babu: రామ్-బోయపాటి సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్!

రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమాను రూపొందించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం రామ్.. లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. బోయపాటి సినిమాను మొదలుపెట్టనున్నారు. అయితే ఈ కాంబినేషన్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది. రామ్-బోయపాటి సినిమాలో బాలయ్య కూడా కనిపించబోతున్నారట. అయితే ఆయనేం ఈ సినిమాలో నటించడం లేదు.

కాకపోతే.. ఆయన ప్రస్తావన ఈ సినిమాలో ఉండబోతుందట. ‘జై బాలయ్య’ నినాదం బాలయ్య అభిమానులకు చాలా ఇష్టం. బాలయ్య ఉన్నా.. లేకపోయినా.. ‘జై బాలయ్య’ అనే నినాదం మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఇతర హీరోల సినిమాల్లో కూడా ‘జై బాలయ్య’ అని అరుస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు బాలయ్య అభిమానులను ఆకట్టుకోవడానికి రామ్-బోయపాటి సినిమాలో ‘జై బాలయ్య’ నినాదాలతో మార్మోగిపోయేలా ఓ ఎపిసోడ్ ను రూపొందించనున్నారట. ఈ సినిమాలో రామ్..

బాలయ్య అభిమానిగా కనిపించనున్నారని.. ఓ సన్నివేశం మొత్తం బాలయ్య రిఫరెన్స్ లతో నిండిపోతుందని సమాచారం. ఆ సీన్ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. ఇదివరకు వెండితెరపై చాలా మంది హీరోలు బాలయ్య అభిమానులుగా కనిపించారు. అయితే ఇక్కడ ఈ సీన్ ను డిజైన్ చేసింది దర్శకుడు బోయపాటి. ఆయన బాలయ్యను వెండితెరపై ఎలా చూపిస్తారో తెలిసిందే. తన హీరోని బాలయ్య అభిమానిగా మార్చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus