‘రెడ్’ కోసం ‘డించక్ డించక్’ అంటూ అదరగొట్టే స్టెప్స్ వేసిన రామ్, హెబ్బాపటేల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ తర్వాత రామ్ చేసిన ఈ సినిమా క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్,హెబ్బా పటేల్ పై చిత్రీకరించిన స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను ఈ రోజు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్ మాట్లాడుతూ “సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా సెట్ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయం తో ఈ పాట చిత్రీకరించాం.”ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూక కే జింక …డించ క్ డించ క్ డింక .. మా బీచ్ కి రావే ఇంక “ అంటూ కాసర్ల శ్యామ్ రాయగా, సాకేత్, కీర్తనా శర్మ ఆలపించిన ఈ పాటకు జా నీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. దీంతో పాటు ఈ సినిమా లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.” అని తెలిపారు.

Ram Pothineni, Hebah Patel Dinchak Song Teaser1

నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ “మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా ఉపకరించాయి. పాట ఎక్స్ట్రాఆర్డినరీ గా వచ్చింది. రామ్ తన స్టెప్స్ తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్ కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్ లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.” అని చెప్పారు.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus