‘అక్కడ స్పేస్ లేదు ఆయన తీసుకున్నాడు!’ ఈ డైలాగ్ గుర్తుందా? ప్రముఖ గీత రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాన్‌స్టాప్ ప్రసంగంలోని డైలాగ్ అది. ఇప్పుడు అదే డైలాగ్‌ని తమన్ వాడుకున్నాడు. రామజోగయ్య శాస్త్రి గురించి చెప్పడానికి. ఇటీవల తమన్ ఓ టీవీ షోకి హాజరయ్యాడు. అందులో గీత రచయితల గురించి చెబుతూ… రామజోగయ్య శాస్త్రి గురించి చెప్పాడు. అప్పుడే ఈ ‘స్పేస్’ మేటర్ వచ్చింది.
రామజోగయ్య శాస్త్రి గురించి చెబుతూ… రామజోగయ్య శాస్త్రి తనకు తండ్రి లాంటి వారు అంటూ పొగిడేశాడు. నా సంగీతాన్ని అతను డిఫైన్ చేసే విధానం అద్భుతం అని చెప్పాడు. అలాగే ఆయన సంగీతాన్ని ఎంజాయ్ చేసే విధానం గురించీ మాట్లాడాడు. ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి పడ్డ కష్టం గురించి కూడా చెప్పాడు తమన్. ఆయన రాసిన పాటల వెనుక చాలా కష్టం ఉందని, అక్కడ స్పేస్ లేకపోయినా ఆయన తీసుకొని అద్భుతమైన పాటలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు తమన్.
యాంకర్ సాకేత్ మాట్లాడుతూ రామజోగయ్య శాస్త్రి గురించి 30 విషయాలు చెప్పండి అంటే… చాలా ఉన్నాయి. 45 విషయాలు చెప్పాలి అన్నాడు తమన్. మణికొండ నుండి ప్రసాద్ ల్యాబ్ వరకు చెప్పాలి అంటూ నవ్వేశాడు. ‘భీమ్లా నాయక్’ లాంటి కమర్షియల్ సినిమాలో అలాంటి సాహిత్యం రాయడం చాలా కష్టం. కానీ ఆయన చేసి చూపించాడు. దాంతోపాటు ఆయన చాలా మొండి అని, ఆయన రాసిందే పాడాలని అంటుంటారని కూడా చెప్పాడు తమన్.
ఈ క్రమంలో తమ మధ్య తగవులు జరిగేవని, ఆస్తి తగాదాల వరకు వెళ్లిపోయేవాళ్లమంటూ సరదాగా నవ్వేశాడు తమన్. అయితే ఈ మాటలకు రామజోగయ్య శాస్త్రి కూడా స్పందించారు. ‘నా వయసు పెంచేస్తున్నాడు. ఎవరైనా నన్ను కాపాడండి’ అంటూ ఆయన కూడా సరదా ట్వీట్ ఒకటి చేశారు. ఈ ఇద్దరి కలయికలో చాలా హిట్ గీతాలొచ్చాయి. ఆ అనుబంధంతోనే ఇలా మాట్లాడుకుంటున్నారన్న మాట.
నా వయసు పెంచేస్తున్నాడు..
కాపాడండి ఎవరైనా…😎 https://t.co/dV3UupLqlH— RamajogaiahSastry (@ramjowrites) January 16, 2022
Most Recommended Video
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!