Ramarao On Duty Teaser: రామారావు ఆన్ డ్యూటీ.. ఆయుధం లాంటి రవితేజ!

మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హై వోల్టేజ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తనదైన శైలిలో ఆకట్టుకునే రవితేజ మరోసారి డిఫరెంట్ యాక్షన్ సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న రామారావు ఆ డ్యూటీ సినిమాలో మరోసారి రవితేజ పవర్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రవితేజ ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో లీనమై నటిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఈ సారి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా చాలా భిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు మహాశివరాత్రి సందర్భంగా సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇక టీజర్ లో మాస్ మహారాజా రెండు చేతులతో సంతకాలు పెట్టే ప్రభుత్వం అధికారిగా కనిపించబోతున్నాడు. ఇక క్రిమినల్స్ అని తెలిస్తే తన పొజిషన్ ఏమిటి అనేది చూడకుండా వారిని ఊచకోత కోసే అధికారిగా కనిపిస్తున్నాడు.

రవితేజ మాస్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా టీజర్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. ‘ఆయుధం మీద ఆధారపడే నీ లాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నా ధైర్యం అణువణువు ఉంటుంది’ అని మాస్ రాజా చెప్పిన డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. థియేటర్స్ లో ఈ డైలాగ్స్ కు విజిల్స్ పడటం కాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యంశ హీరోయిన్ గా నటిస్తూండగా రాజిమ్షా మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాను సమ్మర్లో ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలని చర్చలు జరుపుతున్నారు. ఆ సమయానికి వరుణ్ తేజ్ కంచె సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ రానుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus