Upasana: డబ్బు కోసమే చరణ్ పెళ్లి చేసుకున్నారన్నారు: ఉపాసన

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఉపాసన రాంచరణ్ జంట ఒకటి అని చెప్పాలి ఇండస్ట్రీలో రాంచరణ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఉపాసన కూడా బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులు ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి. ఇలా ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట పెళ్లయిన 10 సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఇలా ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లి మెగా వారసుడు కోసం ఇటు కుటుంబ సభ్యులు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఉపాసన భారీగా బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు అంటూ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మేము కలిసామని ఇలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందని తెలిపారు.

ఇక పెళ్లి సమయంలో చాలామంది తనపై విమర్శలు చేశారని తెలిపారు. చాలా లావుగా ఉన్నానని అందంగా లేనని బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు.ఇక మరికొందరైతే రామ్ చరణ్ కేవలం డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా విమర్శలు చేశారని తెలిపారు. అయితే తన గురించి వచ్చినటువంటి ఈ విమర్శల విషయంలో తాను ఎప్పుడు బాధపడలేదని ధైర్యంతో ముందుకు వెళ్లానని తెలిపారు.ఇలా ఒకప్పుడు నన్ను ఈ విధంగా విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు అంటూ ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఉపాసన (Upasana) ప్రస్తుతం సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె బేబీ బంప్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఉపాసన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus