దగ్గుబాటి రానా కెరీర్ ప్రారంభం నుండీ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ ఆఫ్ బీట్ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. ‘లీడర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రానా.. మొదటి చిత్రంతోనే నటుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో సీఎం అర్జున్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘నేను నా రాక్షసి’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది.
మరోపక్క బాలీవుడ్ లో కూడా రానా కి వరుస ఆఫర్ లు వచ్చాయి. అయితే ‘బాహుబలి’ చిత్రం వల్లే అతను ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలో విలన్ గా భల్లాల దేవుడు పాత్రలో నటించినప్పటికీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ చిత్రంలో రానా ని రాజమౌళి ఎంచుకోవడం వెనుక రానా నటించిన మరో సినిమా ఉందట. ఆ చిత్రం మరేదో కాదు.. క్రిష్ డైరెక్షన్లో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ చిత్రంలో బి.టెక్ బాబు పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేసాడు అనే చెప్పాలి.
డైలాగ్స్ విషయంలో కూడా రానా ఇరక్కొట్టేసాడు. ఈ చిత్రం రషస్ … రాజమౌళి కూడా చూశాడట. ఆ చిత్రంలో రానా నటన బాగా నచ్చింది అని… భల్లాల దేవుడు పాత్ర కోసం తనని తీసుకోవాలి అని అనుకుంటున్నట్టు కూడా రానా కి ఫోన్ చేసి అడిగాడట. మొదట రానా ఒప్పుకోలేదట. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్ లను అడిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు రానా.