అపజయాలతో ఇబ్బంది పడుతున్న రానాకి బాహుబలి మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఉత్సాహంగా సినిమాలు చేసారు. అవి సూపర్ హిట్ అయి రానాని స్టార్ ని చేశాయి. ఈ సంవత్సరం బాహుబలి కంక్లూజన్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి .. సినిమాలతో రానా ప్రేక్షకులను అలరించారు. బాహుబలిలో విలన్ గా అదరగొట్టగా… సబ్‌మెరైన్ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో విలక్షణ రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రస్తుతం 1945 అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నారు.
దీని తర్వాత తమిళ దర్శకుడు ప్రభు సాల్మోన్ తో ఓ సినిమా చేయబోతున్నారు. హతీ మేరీ సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కనుంది. ఈ రెండు సినిమా ల తరువాత జాతీయ అవార్డ్ విజేత, దక్షిణాదిలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తన ప్రతీ సినిమాను సహజంగా తెరకెక్కించే బాల ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత రానా హీరోగా సినిమాను ప్రారంభించనున్నారు. 2018 సెకండాఫ్ లో మొదలయ్యే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంది.