హిట్ కొట్టిన దర్శకుల చుట్టూ టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు తిరుగుతుంటారు అని అంటుంటారు. అగ్ర హీరోకు ఆ దర్శకుడితో కథ చెప్పించాలని, సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తుంటారు అని అంటుంటారు. అయితే తారక్ (Jr NTR) సినిమాల ఎంపిక చూస్తుంటే దీనికి రివర్స్‌లో ఉంది అనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి తారక్ స్టార్ హీరో అయ్యాక చేసిన చాలా సినిమాల దర్శకులకు అంతకుముందు సినిమా ఫ్లాప్ కానీ, డిజాస్టర్ కాని అయి ఉంది.
ఆ లెక్కన వేరే హీరోకు ఫ్లాప్ ఇచ్చిన చేత్తోనే తారక్‌కు ఆ దర్శకులు హిట్ ఇస్తున్నారు. అంతేకాదు తారక్ అలాంటివాళ్లను నమ్ముతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన సినిమాల నుండే ప్రారంభిద్దాం. ‘దేవర 1’ (Devara) సినిమాకు ముందు దర్శకుడు కొరటాల శివకు (Koratala Siva) ‘ఆచార్య’ (Acharya) లాంటి డిజాస్టర్ ఉంది. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో అదో చేదు జ్ఞాపకం. ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) సినిమా తీసే ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram).. పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) లాంటి డిజాస్టర్ ఇచ్చారు.
ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) లాంటి డిజాస్టర్ తర్వాతనే దర్శకుడు బాబి (K. S. Ravindra).. తారక్‌తో ‘జై లవకుశ’(Jai Lava Kusa) సినిమా చేశారు. అలాగే మహేష్ బాబుకు (Mahesh Babu) ‘వన్: నేనొక్కడినే’ (1: Nenokkadine) లాంటి ఇబ్బందికర సినిమా ఇచ్చిన సుకుమార్‌తో (Sukumar) కలసి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేశాడు తారక్. ఇక ‘టెంపర్’ సినిమా తీయకముందు పూరి జగన్నాథ్‌కు (Puri Jagannadh) వరుస ఫ్లాప్‌లు ఉన్నాయి. దీంతో ‘టెంపర్’ (Temper) కాంబో మీద నమ్మకం లేదు ఆ రోజుల్లో ఫ్యాన్స్‌కి.
ఇక ‘బందావనం’ (Brindavanam) సినిమా చేసే ముందు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ‘మున్నా’ (Munna) ఒకటే చేశారు. ఆ సినిమా ఇబ్బందికర ఫలితమే అందుకుంది. ఇలా తారక్ స్టార్ హీరో అయ్యాక చాలా వరకు ట్రాక్ రికార్డు గమనించకుండానే దర్శకులతో సినిమాలు చేశాడు. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఆ దర్శకులు కూడా అలానే నిలెబట్టుకుని కెరీర్ మరింత బలంగా నిలిచే సినిమాలు ఇచ్చారు.