నేషనల్ క్రష్ రష్మిక ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె తెలుగులో వరుస బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ చిత్రాలలో నటించి అగ్ర తారగా పేరు సంపాదించుకున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక వరుస బాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొందిన ఈమె ఇకపై సినిమాలకు గుడ్ బై చెబుతుందని వార్త వినబడుతుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి న్యూస్ రిపోర్టర్ గా స్థిరపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా నిజమే అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమాలో రష్మిక పాత్రకు సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. హీరో పాత్రకు ఈమె పాత్రకు ఒక కనెక్షన్ ఉంటుందని ఆ కనెక్షన్ ఆమె వృత్తికి కూడా లింక్ అయి ఉంటుందని తెలుస్తోంది. శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పై ఇప్పటికీ కీలక సన్నివేశాలన్నింటిని పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాతో పాటు హిందీలో మరో రెండు సినిమాలను కూడా పూర్తి చేస్తుంది. అలాగే తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తమిళ హీరో విజయ్ సరసన వారసుడు అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు. అలాగే పుష్ప 2 సినిమాలో కూడా ఈమె నటిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. హిందీ తమిళ తెలుగు సినిమాలతో రష్మిక ప్రస్తుతము ఎంతో బిజీగా గడుపుతున్నారు.