ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇలా తెలుగు తమిళ భాషలోనే కాకుండా హిందీలో కూడా నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. సినిమాల పరంగా రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నప్పటికీ
తనకు ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన వెంటనే తన కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో ఈమె చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రష్మిక తన చిట్టి చెల్లితో ఆడుకుంటూ ఉన్న ఫోటోలు క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి. రష్మిక తల్లితండ్రులు బెంగళూరులో నివసించగా ఈమె మాత్రం షూటింగ్ పనులపై హైదరాబాద్ ముంబై వంటి ప్రాంతాలలో నివసిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా రష్మిక ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన తల్లిదండ్రుల గురించి ఒక పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రుల పెళ్లిరోజు అయినప్పటికీ నేను చాలా ఆలస్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను క్షమించండి అంటూ హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్సీ. నన్ను పుట్టించినందుకు, ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చి నాకు నేనుగా నాకు నచ్చినట్టుగా బ్రతకనిస్తున్నందుకు థాంక్స్..నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరే అందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ విధంగా రష్మిక తన తల్లిదండ్రుల గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తూ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే విజయ్ సరసన వారసుడు అనే చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో 3 సినిమా షూటింగ్ లతో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.