Rashmika: పుష్ప ఈవెంట్ లో అభిమానికి గాయాలు.. రష్మిక అప్సెట్!

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా మంచి క్రేజ్ అందుకుంటున్న పుష్ప సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనేలా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకకు ఆదివారం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అయితే ఈ వేడుక కోసం లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో సినిమా పై పెరుగుతున్న అంచనాలు స్థాయి ఎలా ఉందొ మరోసారి అర్ధమయ్యింది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు సజావుగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు ఎంత కంట్రోల్ చేసినా కూడా కొంత మంది అభిమానులను అదుపు చేయలేకపోయారు. కొన్ని పరిస్థితుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ వెళ్లిపోయే సమయంలో కొంతమంది అభిమానులు గాయపడినట్లు తెలుస్తోంది.

అందులో ఒక అభిమాని మరింత ఎక్కువగా గాయపడటంతో విషయం చిత్రయూనిట్ వరకు వెళ్ళింది. ఆ ఘటనపై రష్మిక మందన కూడా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా రష్మీక ఈ విధంగా స్పందించారు. నిన్న జరిగిన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ.. ధన్యవాదాలు. కానీ మీలో కొందరు గాయపడ్డారని నేను విన్నాను. అందుకు నాకు చాలా బాధగా అనిపించింది.. మీరందరూ బాగున్నారనీ.. మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటున్నారని నేను నిజంగా ఆశిస్తున్నాను.. అని రష్మీక వివరణ ఇచ్చారు.

ఇక సినిమాలో రష్మీక మందన్న శ్రీవల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మీక తన మాటలతో ఎంతగానో ఆకట్టుకుంది. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని నేను గీత గోవిందం రిలీజ్ సమయంలోనే అనుకున్నాను. అప్పుడు ఆయన ఆడియో వేడుకకు ప్రత్యేకంగా వచ్చినప్పుడు మనసులో అనుకున్నాను. అది ఇప్పుడు నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని రష్మిక తెలియజేశారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus