Rashmika: విజయ్ తల్లి గురించి అలాంటి కామెంట్స్ చేసిన రష్మిక

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్ గా గుర్తింపు పొంది వరుస భాష చిత్రాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈమె ఇండియన్ ఐడల్ సింగింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె అక్కడ ఒక సింగర్ తో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఒక దివ్యాంగురాలు అయినటువంటి సింగర్ ను రష్మిక ఎంతో మెచ్చుకున్నారు. ఆ సింగర్ అంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవికి కూడా ఎంతో ఇష్టమట ఇదే విషయాన్ని రష్మిక తెలిపారు.ఇక ఆమెతో రష్మిక మాట్లాడుతూ.. మీకు మా ఇంటి నుంచి విషెస్ వచ్చాయి.

మాధవి ఆంటీ నాకు సెకండ్ మదర్ లాంటి వారు ఆమెకు కూడా మీరంటే చాలా ఇష్టమని (Rashmika) రష్మిక తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ రష్మిక దేవరకొండ కోడలుగా ఫిక్స్ అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మా ఇల్లు అని సంబోధించడమే కాకుండా నాకు ఆమె సెకండ్ మదర్ లాంటి వారు అంటూ కామెంట్ చేయడంతో ఈమె విజయ్ దేవరకొండ ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతుందని ఇది కన్ఫర్మ్ అయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus