ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule) బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ రేసులో ముందుంది. “యానిమల్”తో (Animal) బాలీవుడ్‌లో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతుంది. తెలుగు ప్రేక్షకుల మధ్య రష్మిక క్రేజ్ ఎంతో పెరిగిపోయింది. ఆమె చేసిన సినిమాలు కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్తియేట్ చేస్తున్నాయి.
Rashmika
అంతే కాకుండా, అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాయి. ‘పుష్ప 2’లో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక, రష్మిక బాలీవుడ్‌లో తన తదుపరి ప్రాజెక్ట్‌లతో అదే లక్కను కొనసాగిస్తోంది. రష్మిక చేస్తోన్న సినిమాలు చూస్తుంటే ఆమె టాలీవుడ్ హీరోయిన్లందరికంటే ముందున్నట్లు అనిపిస్తుంది. “యానిమల్”తో బాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రష్మిక, ఇప్పుడు “చావా,” (Pushpa 2: The Rule) “సికందర్” (Sikandar) లాంటి చిత్రాల్లో నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటోంది.
ఆమె కథల ఎంపిక, డాన్స్ స్కిల్స్, గ్లామర్ తో పాటు నటనలోని వెర్షటిలిటీ ఆమెను మిగతా హీరోయిన్లకు కంటే ప్రత్యేకంగా నిలిపాయి. తెలుగులో కూడా ఆమె సౌత్‌లో అన్ని పెద్ద ప్రాజెక్ట్స్‌లో ముందుండటం విశేషం. పాన్ ఇండియా సినిమా నటిగా రష్మిక ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడం ఆమె టాలెంట్‌కు అద్దం పడుతుంది. ప్రేక్షకులు రష్మికను వెండితెరపై చూడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
బాలీవుడ్‌లో పోటీ ఎక్కువ ఉన్నా, ఆమె చేస్తున్న సినిమాలు ఆమె లక్‌కి మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. దర్శక, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేయడం అనేది ఆమె రేంజ్‌ను మరోసారి నిరూపిస్తుంది. ఇప్పుడు రష్మిక ఫామ్ చూస్తుంటే, తాను మరికొన్ని ఏళ్ల పాటు టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగించనుందని అనిపిస్తోంది.