సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. గోల్డెన్ లెగ్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్నా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం రష్మిక డీ గ్లామరస్ గా కనిపించడం గమనార్హం. ఇప్పటికే పుష్ప సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో చిత్తూరు యాసలో రష్మిక చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
రష్మిక పుష్ప సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ సామీ సామీ సాంగ్ కోసం చాలా కష్టపడ్డానని ఈ పాటను థియేటర్లలో చూసిన తర్వాత అందరూ నన్ను ప్రశంసిస్తే చాలని చెప్పుకొచ్చారు. తాను డైరెక్టర్స్ నటిని అని దర్శకులు ఏం చెబితే అదే చేస్తానని రష్మిక మందన్నా కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే రష్మిక చేసిన కామెంట్ల గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ పుష్ప సినిమాలో అసలు రష్మికను హీరోయిన్ గా తీసుకోకుండా ఉంటే బాగుండేదని రష్మిక ఓవరాక్షన్ ను చూడలేకపోతున్నామని రిప్లై ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోరు. అయితే రష్మిక మాత్రం నెటిజన్ కామెంట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యాక్టింగ్ చేశానో ఓవర్ యాక్టింగ్ చేశానో జీవితంలో ఏదో ఒకటి సాధించానని ఆమె తెలిపారు. నువ్వు ఏం సాధించావో చెప్పు నాన్నా అంటూ రష్మిక నెటిజన్ కు ఘాటుగా చురకలు అంటించారు.
రష్మిక నెటిజన్ కు ఇచ్చిన కౌంటర్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో కూడా రష్మిక నెటిజన్ల కామెంట్లకు ధీటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఎదిగేవాళ్లపై విమర్శలు సహజమని ఆ విమర్శలను పట్టించుకోకుండా కెరీర్ లో ముందడుగులు వేయాలని రష్మికకు చెబుతున్నారు. పుష్ప పార్ట్ 1పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.