Ravi Teja: వాల్తేరు వీరయ్యపై రవితేజ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

చిరంజీవి, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ కు 20 రోజుల సమయం ఉండగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు కూడా క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

అతి త్వరలో ఈ సినిమా నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజకు వాల్తేరు వీరయ్య సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుందనే ప్రశ్న ఎదురైంది. పూనకాలు లోడింగ్ అన్నారు కదా ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని రవితేజ కామెంట్లు చేశారు. పండుగకు ఈ సినిమా విడుదలవుతుంది కదా ఇక పండగే అని రవితేజ పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ నా సొంత మనిషి అని రవితేజ కామెంట్లు చేశారు.

అదే సమయంలో చిరంజీవి అన్నయ్యపై కూడా తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఈ రీజన్స్ వల్లే వాల్తేరు వీరయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేశానని మాస్ మహారాజ్ రవితేజ కామెంట్లు చేశారు. వాల్తేరు వీరయ్య మూవీ కథ కూడా ఎంతగానో నచ్చిందని రవితేజ వెల్లడించారు. రవితేజ చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రవితేజ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు. ధమాకా మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా ధమాకా మూవీ తెరకెక్కిందని రవితేజ అన్నారు. రవితేజకు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదని కామెంట్లు వ్యక్తమవుతుండగా ధమాకా మూవీతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus