మాస్ మహారాజా రవితేజ సక్సెస్ చూసి ఎంత కాలం అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంత డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. చివరగా చేసిన డిస్కో రాజా కూడా దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. రవితేజ చివరిసారిగా రాజా ది గ్రేట్ ద్వారా సక్సెస్ అందుకున్నాడు తప్పితే.. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ కూడా కనీసం యవరేజ్ గా కూడా వసూళ్లు అందుకోలేదు.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. మాస్ రాజా ప్రస్తుతం తన ఆశలన్నిటిని కూడా క్రాక్ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఆ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మాస్ రాజా 14కోట్ల వరకు షేర్స్ రాబడితే చాలట.
నైజాంలో 4.2కోట్లు.. ఇక సీడెడ్ లో అయితే 2.8కోట్ల వరకు ధర పలికింది. ఎక్కువగా ఆంధ్రలో 6కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. మిగతా ఏరియాల్లో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు చూస్తే క్రాక్ మినిమమ్ 14 నుంచి 15కోట్ల వరకు ఈజీగా వసూళ్లు చేయగలదని, కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటివరమే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుందని అంటున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!