Ravi Teja: మూడు సినిమాలతో రచ్చ చేయబోతున్న రవితేజ!

రవితేజ నటనలో దూకుడు ఎక్కువ, అలాగే సినిమాల ఎంపికలోనూ జోరు ఎక్కువగానే ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో రవితేజ నుండి ఆ ఫోర్స్‌ చూశాం. ఇప్పుడు మరోసారి రవితేజ ఆ పని చేసి చూపించబోతున్నారు. ఏకంగా నాలుగైదు నెలల వ్యవధిలో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ వస్తుందని అంటున్నారు. ఆ సినిమాల వివరాలేంటో చూసేయండి మరి. ‘కిక్‌’ ముందు వరకు రవితేజ కెరీర్‌లో చిన్న స్లోనెస్‌ కనిపించింది.

ఆ సినిమా ఇచ్చిన విజయమే ఈ జోరుకు కారణం అంటున్నారు. కొత్త ఏడాదిలో మాస్ మహరాజా జాతర మొదలవుతుంది. ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ రిలీజ్‌ డేట్‌ కూడా ఇచ్చేశారు. ‘ఖిలాడీ’ వచ్చిన సుమారు 45 రోజులకు అంటే మార్చి 25న ‘రామారావు…’ను తీసుకొస్తున్నారు. ‘ఖిలాడి’ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ‘రామారావు…’ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది.

దీంతోపాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ‘ధమాకా’ అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘రామారావు..’ పని అయ్యాక ‘ధమాకా’ జోరు పెంచాలని రవితేజ అనుకుంటున్నాడట. ఆ లెక్కన ఈ సినిమాను మే, జూన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ లెక్కన వరుస నెలల్లో సినిమాలు పక్కా.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.