మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్లు ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.
ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మంచి కథా కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో ‘నేల టికెట్టు’ తీస్తున్నారు.
మరి ఒక మాస్ హీరో ఒక క్లాస్ దర్శకుడు కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకి నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ సమాధానం చెప్పేసింది.
“ఫస్ట్ టైం లైఫ్ లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది.”
“చుట్టూ జనం మధ్యలో మనం.. అది కదరా లైఫ్”
“ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసే వాడు ఒక్కడు లేడు”
“ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం”
లాంటి అద్భుతమైన అర్థవంతమైన కళ్యాణ్‌కృష్ణ మార్కు క్లాస్ డైలాగులు ఒక వైపు..
“నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయిన్‌టైన్ చెయ్”
“నేల టిక్కెట్టు గాళ్ళతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు”
లాంటి ఈలలు వేయించే రవితేజ మార్కు మాస్ డైలాగులు మరో వైపు.. చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతీ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీసారని.మే 25న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు.