సుకుమార్, రామ్ చరణ్ మూవీ ఆలస్యానికి కారణం ఏమిటంటే?
- March 24, 2017 / 11:37 AM ISTByFilmy Focus
ధృవ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జనవరి 30న లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ గత నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలి. లొకేషన్ విషయంలో జరిగిన ఇబ్బందుల వల్ల మార్చి 20 తేదీకి వాయిదా పడింది. కానీ ఆ తేదీ వచ్చి, పోయి నాలుగు రోజులు అవుతోంది. అయినా సినిమా షూటింగ్ మొదలుకాలేదు. దీంతో మెగా అభిమానులు ఎంతగానో నిరుత్సాహపడ్డారు. ఇంతకీ ఆలస్యానికి కారణం ఏమిటని చెర్రీ సన్నిహితులను ప్రశ్నించగా వారు ఆసక్తికర విషయం చెప్పారు. “ఈనెల 27న చరణ్ పుట్టినరోజు. బర్త్ డే వేడుకలు పూర్తయిన తర్వాత షూటింగ్ లో పాల్గొనాలని చరణ్ భావిస్తున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోంది” అని వెల్లడించారు.
1990 కాలంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చెర్రీ కూడా పల్లెటూరి కుర్రోడిగా కనిపించబోతున్నారు. ఆనాటి యువతిగా సమంత తన అమాయకత్వమైన నవ్వుతో మరోసారి అందరి హృదయాలను దోచుకోనుంది. ఈ సినిమాకోసం మనసుకు హత్తుకునే డైలాగ్స్ ని సాయి మాధవ్ బుర్రా రాశారు . మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్, కెమెరా మెన్ గా రత్నవేలు పనిచేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















