నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వంటి అప్పటి స్టార్ హీరోలు.. ఏకంగా 14 సినిమాల్లో కలిసి నటించారట. ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం నుండీ ‘సత్యం శివం’ వరకూ వీళ్ళద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసారు. అయితే కలిసి నటించిన సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, సావిత్రి,జమున, ఎస్వీఆర్, సూర్యకాంతం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పటి జనరేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈ చిత్రం హాట్ ఫేవరేట్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని రిమేక్ చెయ్యాలి అని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ … ఏ.ఎన్.ఆర్ తనయుడు నాగార్జున ప్లాన్ చేసారట.. కానీ సూర్యకాంతం, ఎస్వీఆర్ రేంజ్ నటులు దొరకరు అని భావించి.. రిమేక్ ఆలోచన మానుకున్నట్టు తెలుస్తుంది. తరువాత ‘చుప్కే చుప్కే’ అనే బాలీవుడ్ మూవీ ని కూడా రిమేక్ చెయ్యాలి అని ప్లాన్ చేసారట. అమితాబ్, ధర్మేంద్ర లు హీరోలుగా నటించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయ్యింది.
ఈ చిత్రం రిమేక్ ను కచ్చితంగా చెయ్యాలి అని నాగ్, బాలయ్య ఫిక్స్ అయ్యారట. అందుకు సంబందించిన పనులు కూడా మొదలు పెట్టరాట. కానీ కారణాలు ఏంటి అన్నది తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందట. కానీ నాగార్జున .. హరికృష్ణ తో ‘సీతారామరాజు’ సినిమాలో నటించాడు. బాలయ్య .. నాగేశ్వర రావుతో ‘శ్రీరామ రాజ్యం’, ‘గాండీవం’, ‘భార్య భర్తల బందం’ వంటి చిత్రాల్లో నటించాడు. ఇక సుమంత్ తో కూడా గతేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో నటించాడు బాలయ్య.