Chiranjeevi , Mohan Babu: ఆ ఒక్క రీజన్ వల్లే చిరంజీవి, మోహన్ బాబులకు ఆహ్వానం అందలేదా?

ఈ నెల 20వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్న సంగతి తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు పలువురు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు ఈ ఈవెంట్ కు సంబంధించి ఆహ్వానం అందింది. అయితే చిరంజీవి, మోహన్ బాబులకు మాత్రం ఈ వేడుకకు ఆహ్వానం అందకపోవడం సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆహ్వానం అందకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులలో మోహన్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే.

అయితే మోహన్ బాబు ఎక్కడికి వెళ్లినా ముక్కుసూటిగా మాట్లాడతారు. మోహన్ బాబు ప్రస్తుత టీడీపీ ముఖ్య నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ రీజన్ వల్లే ఆయనకు ఆహ్వానం అందలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేరు. అయితే చిరంజీవి పలు సందర్భాల్లో జగన్ ను కలవడం జరిగింది.

వైసీపీ సైతం (Chiranjeevi) చిరంజీవికి ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఈ రీజన్స్ వల్లే చిరంజీవికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సినీ ప్రముఖులు అందరినీ ఆహ్వానించి ఉంటే బాగుండేదని చెప్పవచ్చు. మరోవైపు ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది.

రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో తారక్ ఈ వేడుకలకు హాజరు కావడం లేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈరోజు రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎన్టీఆర్30 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus