ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకొంది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అయితే వాటి చిత్రీకరణకు 40 రోజుల వరకు టైం పడుతుందనేది ఇన్సైడ్ టాక్. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని అక్టోబర్ 13నే విడుదల చేస్తున్నట్టు కూడా చిత్ర యూనిట్ సభ్యులు కన్ఫర్మ్ చేశారు. కానీ అది అసాధ్యమే అనేది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ ని 12 భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం మార్కెట్లు చాలా కీలకం.
మన టాలీవుడ్లో అయినా థియేటర్లు తెరుచుకుని.. జనాలు రావడం వంటివైనా మనం చూసాం. కానీ బాలీవుడ్ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు.జూలై నెలాఖరు నుండీ అక్కడ కొత్త సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ముందుగా అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ మూవీని జూలై 27న విడుదల చేయబోతున్నారు. కరోనాకి భయపడకుండా జనాలు ఆ సినిమాకి కనుక వస్తే…అక్కడ వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతాయి. దీని ఫలితం తేడా కొడితే కష్టమే..! ‘ఆర్.ఆర్.ఆర్’ ని ‘పెన్ స్టూడియోస్ ఇండియా వారు హిందీ రైట్స్ ను, లైకా వారు తమిళ్ రైట్స్ ను, ఫార్స్ వారు ఓవర్సీస్ రైట్స్ ను కొనుగోలు చేశారు.
ఈ సంస్థలు రూ.500 కోట్ల వరకు చెల్లించి ‘ఆర్.ఆర్.ఆర్’ హక్కులను కొనుగోలు చేశారు. కాబట్టి వీళ్ళకి రూ.600 కోట్లు వస్తేనే సేఫ్ అవుతారు.అది జరగాలంటే ఇండియా మొత్తం ఈ సినిమా రిలీజ్ కావాలి. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ‘ఆర్.ఆర్.ఆర్’ ను బయ్యర్స్ రిలీజ్ చేస్తారు.చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పూర్తి చేసినంత మాత్రాన.. ‘ఆర్.ఆర్.ఆర్’ అక్టోబర్ 13నే విడుదలవుతుంది అనుకుంటే ఎలా? అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కాబట్టి.. మొన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో విడుదల తేదీని ప్రకటించింది కేవలం హీరోల అభిమానులను కూల్ చేయడానికే అనే ఆన్సర్ కూడా వినిపిస్తుంది.