Hero Nani: ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రీమేక్‌ హక్కుల చర్చలు సాగుతున్నాయా!

సినిమా వాళ్ల మాటల్లో బయటకు చెప్పని మరో అర్థం ఉంటుంది అంటారు. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆ అర్థం అంతర్లీనంగా ఉంటుంది అని చెబుతుంటారు. తాజాగా అలాంటి అంతర్లీన అర్థంతో నాని మాట్లాడాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా గురించే మేం చెబుతున్నది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ గురించి నాని మాట్లాడుతూ కథే ఏ సినిమానైనా పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్తుంది.

అలాగే అన్ని భాషల వారు చూడదగ్గదే పాన్‌ ఇండియా మూవీ. ‘శ్యామ్‌ సింగరాయ్‌’కూడా ఈ కోవకే చెందుతుంది. అందుకే దక్షిణాది భాషలన్నింటిలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. అయితే హిందీలో విడుదల చేయడం లేదు. ఏమో ఏ హృతిక్‌ రోషనో ఈ సినిమా హిందీలో చేస్తారేమో అన్నారు నాని. మామూలుగా అయితే అక్కడ హిందీలో ఎవరైనా చేస్తారేమో అనే పదం రావాలి. కానీ హృతిక్‌ రోషన్‌ పేరే ఎందుకు తీసుకొచ్చారు అనేదే ఇక్కడ చర్చ.

కాబట్టి ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌కు సంబంధించి ఏమైనా చర్చలు జరిగాయా అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మన దగ్గర ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈలోపు సినిమా రీమేక్‌ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus