NBK107: బాలకృష్ణ సినిమా రీమేక్‌ రూమర్స్‌ ఇప్పట్లో ఆగవా

ఓ సినిమా మీద రీమేక్‌ పుకార్లు వస్తే… అంత త్వరగా ఆగవు అంటారు. అయితే కథ, కాన్సెప్ట్‌ చెప్పేయాలి, లేదంటే సినిమా విడుదలవ్వాలి. ఇప్పుడు బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ సినిమా ఓ కన్నడ సూపర్‌ హిట్‌ మూవీకి రీమేక్‌ అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని చిత్రబృందం ఇప్పటికే ఖండించింది. అయితే సినిమా ఫస్ట్‌లుక్‌ బయటకు రావడంతో మరోసారి రీమేక్‌ కామెంట్లు చుట్టుముట్టాయి.

Click Here To Watch

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా #NBK107 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. ఈ క్రమంలో సినిమాలో బాలకృష్ణ లుక్‌ లీకైంది. చిత్రీకరణలో భాగంగా ఎవరో మొబైల్‌లో ఫొటో తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వైరల్‌ చేసేశారు. దీంతో చిత్రబృందం ఇటీవల అఫీషియల్‌గా అదే లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఓ క్వారీ లాంటి ప్రాంతంలో డార్క్‌ బ్యాగ్రౌండ్‌లో బాలయ్య లుంగీ కట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు లుక్‌ను రూపొందించారు.

2017లో కన్నడ సీనియర్‌ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ నటించిన ‘ముఫ్తి’ అనే సినిమా గుర్తుందా? ఆ రోజుల్లో ఆ సినిమా భారీ హిట్‌. ఒకసారి గూగుల్‌లో ‘mufti sivarajkumar’ అని కొట్టి చూడండి కొన్ని లుక్స్‌ కనిపిస్తాయి. అందులో ఓ లుక్‌కి ఇప్పుడు బాలయ్య సినిమా లుక్‌కి దగ్గర సంబంధం ఉంది అని మీరే అంటారు. నల్లటి చొక్కా, డార్క్‌ కలర్‌ లుంగీతోపాటు బ్యాగ్రౌండ్‌ ఆ రెండు పోస్టర్లలో కామన్‌ అని చెప్పొచ్చు. అయితే ‘ముఫ్తి’ లుక్‌లో శివరాజ్‌కుమార్‌ పక్కన మరో హీరో శ్రీమురళి ఉంటాడు.

మొన్నామధ్య బాలయ్య సినిమా గురించి చర్చ వచ్చినప్పుడు మరో కుర్ర హీరో కూడా ఉంటాడు అని పుకార్లు వచ్చాయి, వార్తలుగా మారాయి. దీంతో ‘ముఫ్తి’, #NBK107 సినిమాలకు దగ్గర సంబంధం ఉంది అంటూ లెక్కలేసేసుకుంటున్నారు. మరి ఇప్పుడు చిత్రబృందం మళ్లీ స్పందిస్తుందా? లేక ముందు చెప్పిన మాట సరిపోతుందని వదిలేస్తుందా అనేది చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus