మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (S. S. Rajamouli)..ల కలయికలో ఓ పాన్ వరల్డ్ మూవీ (SSMB29) తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ‘శ్రీ దుర్గ ఆర్ట్స్’ బ్యానర్ పై ఎస్.గోపాల్ రెడ్డి, కె.యల్.నారాయణ్..లు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2020 లో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు రాజమౌళి. ఇది పట్టాలెక్కడానికి 5 ఏళ్ళు టైం పట్టింది. ఈరోజు అనగా జనవరి 2న అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
SSMB29
దీనికి మహేష్ బాబు కూడా హాజరవ్వడం జరిగింది. సాధారణంగా మహేష్ బాబు… పూజా కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు. కానీ రాజమౌళితో చేస్తున్న మూవీ కోసం తన సెంటిమెంట్ ను కూడా పక్కన పెట్టాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా ఎంపికైనట్టు కూడా ఎప్పటి నుండో ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంది అంటున్నారు. మరి పారితోషికాల లెక్క ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్న అందరిలో ఉంది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు..ల పారితోషికాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం… ఈ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు, రాజమౌళి..లు పారితోషికం ఏమీ తీసుకోవడం లేదట.
‘పోకిరి’ టైంలో మహేష్ బాబు, ‘విక్రమార్కుడు’ టైంలో రాజమౌళి ఈ ప్రాజెక్టు కోసం అడ్వాన్స్ తీసుకున్నారు. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేవరకు వీళ్ళ స్టాఫ్ కి ఖర్చులు అండ్ మెయింటెయినెన్స్ ఖర్చులు మినహా ఏమీ తీసుకోవడం లేదట. కానీ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. కాబట్టి మొదటి భాగానికి జరిగిన బిజినెస్, అలాగే రెండో భాగానికి జరిగిన బిజినెస్.. లలో 40 శాతం వాటా మహేష్, రాజమౌళి..లు తీసుకుంటారని ఇన్సైడ్ టాక్.