కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే అతను తమిళంలో చేసే సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇక కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య చేసిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).. మే 1న రిలీజ్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మరోపక్క పోటీగా రిలీజ్ అయిన ‘హిట్ 3’ (HIT 3) కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయినప్పటికీ ‘రెట్రో’ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.92 cr |
సీడెడ్ | 0.28 cr |
ఉత్తరాంధ్ర | 0.30 cr |
ఈస్ట్ | 0.14 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.22 cr |
కృష్ణా | 0.20 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 2.27 cr |
‘రెట్రో’ (Retro) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ సినిమా రూ.2.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.66 కోట్లు. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.5.73 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం డల్ గా ఉండటంతో స్క్రీన్స్ షేర్ అవుతున్నాయి.