సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘డీజే టిల్లు’ (DJ Tillu) , ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇటీవల విడుదలైన ‘జాక్’ (Jack) సినిమా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా కథ, ఎక్స్‌క్యూషన్‌లో లోపాలు, సిద్దు ‘టిల్లు’ క్యారెక్టర్‌ను రిపీట్ చేసినట్లు అనిపించడంతో రొటీన్ అనే కామెంట్స్ వచ్చాయి.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు (B. V. S. N. Prasad) కూడా ఈ సినిమా ఆర్థికంగా నష్టాలను మిగిల్చింది. ‘జాక్’ వైఫల్యం సిద్దును ఆలోచనలో పడేసింది. ‘టిల్లు’ సిరీస్‌తో వచ్చిన ఇమేజ్‌కు ఈ సినిమా డ్యామేజ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దు తన కెరీర్‌ను రీబిల్డ్ చేసుకోవడానికి కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. రాశీ ఖన్నా (Raashi Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సిద్దు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించాడు.
‘తెలుసు కదా’ సినిమాకు ఇంకా పెద్దగా హైప్ రాలేదు, రిలీజ్ సమయంలో ప్రమోషన్స్‌పైనే ఆధారపడాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత సిద్దు ‘టిల్లు క్యూబ్’, ‘బాడస్’ సినిమాలపై ఫోకస్ పెడతాడు. కానీ, ఈ సినిమాల స్క్రిప్ట్‌లపై ఎక్కువ సమయం తీసుకుని, జాగ్రత్తగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ‘జాక్’ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న సిద్దు, స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఇకపై మరింత శ్రద్ధ వహించనున్నాడు.
‘టిల్లు’ సిరీస్‌లో సిద్దు కామెడీ టైమింగ్, స్వాగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ, ‘జాక్’లో రా ఏజెంట్ రోల్‌లో కామెడీ, సీరియస్‌నెస్ బ్యాలెన్స్ కుదరలేదని విమర్శలు వచ్చాయి. ఈ ఫెయిల్యూర్‌తో సిద్దు తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘తెలుసు కదా’తో మళ్లీ హిట్ కొట్టి, ‘టిల్లు క్యూబ్’తో సత్తా చాటాలని అతని ప్లాన్. మరి అతని ప్లాన్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.