కోలీవుడ్ స్టార్ హీరోకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘గజిని’ నుండి ఆయన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతూ వస్తోంది. అయితే కొన్నాళ్లుగా సూర్య (Suriya) నుండి వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. ‘ఈటి’ (ఎవ్వరికీ తలవంచడు), ‘కంగువా’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ముఖ్యంగా ‘కంగువా’ (Kanguva) సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సూర్య. కచ్చితంగా అది పెద్ద సక్సెస్ అవుతుంది అనుకున్నాడు.
కానీ అతని నమ్మకం నిజం కాలేదు. ఇక మరో 2 రోజుల్లో ‘రెట్రో’ తో (Retro) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘స్టోన్ బెంచ్ క్రియేషన్స్’ ‘2D ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లపై జ్యోతిక (Jyothika), సూర్య, కార్తికేయన్ సంతానం (Kaarthekeyan Santhanam), రాజశేఖర్ పాండియన్..లు కలిసి నిర్మించారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఆయన టాలీవుడ్లోని కొందరు పెద్దలకి చూపించారట. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైం 2 గంటల 48 నిమిషాలు ఉంటుందట. ఒక గ్యాంగ్స్టర్ తన పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అతని భార్యతో కలిసి ప్రశాంతంగా జీవించాలని వేరే ప్లేస్ కి వెళ్లిన అతనికి.. మళ్ళీ పాత గొడవలు, శత్రువుల ద్వారా సమస్యలు తలెత్తుతాయి.
ఆ తర్వాత ఇతని జీవితం ఎలా మారింది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. సూర్య ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడట. అలాగే ఈ సినిమాతో ఓ కొత్త పూజా హెగ్డేని (Pooja Hegde) చూస్తారని అంటున్నారు. ఆమె మేకోవర్ కానీ నటన కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) మ్యూజిక్ సిట్యుయేషనల్ గా ఉంటుందట.దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నేచురల్ టేకింగ్ కూడా టార్గెటెడ్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది అంటున్నారు.