Revanth: రేవంత్ వాళ్ల అమ్మ రేవంత్ కి ఏం చెప్పింది..? వైరల్ అవుతున్న మేటర్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కొక్కరి ఇంటిసభ్యుల కుటుంబ సభ్యులు వస్తూ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ మెంబర్స్ ని చూస్తూ హౌస్ మేట్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. గత రెండు రోజుల నుంచీ బిగ్ బాస్ వాళ్ల ఆవేదనని, ఆనందాన్ని ఆడియన్స్ కి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న 9మంది ఇంటి కుటుంబసభ్యుల్లో చివరిగా రేవంత్ తన ఇంటి నుంచీ ఎవరు వస్తారా అని ఎదురుచూశాడు. తన భార్య పిలుపు వినగానే హౌస్ అంతా వెతికాడు. చివరగా ప్లాస్మాలో వీడియో కాల్ లో కనిపించింది.

ప్రస్తుతం రేవంత్ వాళ్ల వైఫ్ 9నెలల గర్భిణీ అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి రాలేకపోయింది. వీడియో కాల్ లో రేవంత్ చాలా విషయాలు మాట్లాడాడు కానీ, పర్సనల్ గా మాట్లాడేలోపు కాల్ కట్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బిగ్ బాస్ ని బ్రతిమిలాడాడు. అయినా కూడా బిగ్ బాస్ కనికరించలేదు. కొద్దిసేపటి తర్వాత రేవంత్ వాళ్ల అమ్మ ఇంట్లోకి వచ్చింది. రేవంత్ వాళ్ల అమ్మ రాగానే అందర్నీ పలకరించింది. శ్రీహాన్ నువ్వు ఫ్రెండ్ అవ్వడం అనేది చాలా బాగుందని, ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని చెప్పింది.

అలాగే కీర్తిని దగ్గరకి తీస్కుని నువ్వు మా ఇంట్లో అమ్మాయివి అని, నీకు ఎవ్వరూ లేరని అనుకోవద్దని మా కుతురువి అని ధైర్యం చెప్పింది. హౌస్ లో అందర్నీ పలకరిస్తూ ఫైమా తో కాసేపు ఫన్ చేసింది. ఈలోగా రేవంత్ నీట్ గా గెడ్డం ట్రిమ్ చేస్కుని హీరోలాగా వచ్చాడు. తర్వాత వాళ్ల అమ్మగారితో చాలాసేపు మాట్లాడాడు. ఇక కొన్ని విషయాలు రహస్యంగా మాట్లాడుతూ రేవంత్ చెవిలో వేసింది వాళ్ల అమ్మ. కిచెన్ లో పాలు, గట్రా వ్యవహారాల్లో చూసి చూడనట్లుగా ఉండమని చెప్పింది. అలాగే, నువ్వు గెలుస్తావని నమ్మకం ఉందంటూ మాట్లాడింది.

నువ్వు ఏడవద్దని, కళ్లనీళ్లు పెట్టుకోవద్దని మెల్లగా చెవిలో చెప్పింది. దీంతో రేవంత్ తన తల్లి చెప్పిన మాటల్ని ఆలకించాడు. ఆమె దీవెనలు తీసుకున్నాడు. అంతేకాదు, నువ్వు ఏడుస్తుంటే అలాంటపుడు బిగ్ బాస్ కి ఎందుకు రావాలంటూ ఇంటర్నెట్లో, యుట్యూబ్ లో కూడా పెడుతున్నారని, అన్విత నీకోసం చెప్పమని చెప్పిందని చెప్పింది. నీ కోపం గురించే మాట్లాడుతున్నారని, అది కొద్దిగా తగ్గించుకోమని చెప్పింది. దీంతో రేవంత్ కి బయట సిట్యువేషన్ కొద్దిగా అర్దమైంది. ఇప్పుడు రేవంత్ వాళ్ల అమ్మ చెప్పిన ఈమాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంట్లోకి కావాలనే బిగ్ బాస్ టీమ్ కొన్ని హింట్స్ పంపించిందని అంటున్నారు. ఫైమా వాళ్ల అమ్మ వచ్చినపుడు ఎవిక్షన్ ఫ్రీపాస్ ని తనకోసమే వాడుకోమని చెప్పింది. అలాగే, ఇప్పుడు రేవంత్ వాళ్ల అమ్మ కప్ కొట్టి రమ్మని, కోపం తగ్గించుకోమని చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ తమ గేమ్ ని ఖచ్చితంగా ఈ రెండు వారాలు మార్చుకుంటారు. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ తో విన్నర్ పై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక స్టేజ్ పైన నాగార్జున వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకరిని టాప్ 5 డిసైడ్ చేయమంటే ఇంకా క్లారిటీ వస్తుంది. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus