Revanth, Faima: ఫైమాకి రేవంత్ వార్నింగ్..! అసలు రీజన్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ హౌస్ ని వేడెక్కించాయి. ఫిరంగి ముందు ముఖం పెట్టి రంగు కొట్టి మరీ నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ రెచ్చిపోయారు. గత వారం సీక్రెట్ రూమ్ లో జరిగిన నామినేషన్స్ వల్ల ఆర్గ్యూమెంట్స్ అవ్వలేదు. కానీ, ఇప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ రెచ్చిపోయారు. ముఖ్యంగా రేవంత్ కి ఫైమా, రేవంత్ కి ఆదిరెడ్డికి గట్టిగా పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ వరకూ వెళ్లారు.

ముందు ఆదిరెడ్డి రేవంత్ ని నామినేట్ చేస్తూ మరోసారి తను అన్నమాటలని గుర్తు చేశాడు. నాగార్జున సార్ క్లాస్ పీకిన విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు. బిబి ట్రాన్ పోర్ట్ టాస్క్ లో శ్రీసత్య – శ్రీహాన్ ఇద్దరూ ఉన్నప్పుడు రేవంత్ అమ్మాయిని తీస్కుంటే ఈజీ అవుతుందనే మాట చెప్పాడని, మళ్లీ నేను శ్రీహాన్ అనేసరికి మాటని మార్చావని చాలా క్లియర్ గా చెప్పాడు. దీంతో రేవంత్ దీనిని ఒప్పుకోలేదు. నాగార్జున ప్రూఫ్ చూపించినా కూడా నువ్వు అదే పాయింట్ మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ రెచ్చిపోయాడు.

ఆ తర్వాత రేవంత్ ని ఫైమా నామినేట్ చేసింది. నీమాట మీద నువ్వే నిలబడవని, అప్పుడే ఒక మాట మాట్లాడి వెంటనే మార్చేస్తావని చెప్పింది. అంతేకాదు, లాస్ట్ టైమ్ నా కెప్టెన్సీలో గేమ్ ఆడేటపుడు అందరూ ఉండాలని నువ్వు చెప్పావ్ అని, కానీ నీ కెప్టెన్సీలో చిన్న కప్పు కూడా కడిగించలేకపోయావ్ అని అన్నది. శ్రీసత్య వాష్ రూమ్ కడగలేదని గుర్తు చేసింది. దీంతో శ్రీసత్య వాష్ రూమ్ కడగలేదు కాబట్టి నేను బాధ్యత వహిస్తున్నా అంటూ రేవంత్ అంగీకరించాడు. కానీ, తిరిగి రేవంత్ ఫైమాని నామినేట్ చేసేటపుడు ఇద్దరి మద్యలో మాట మాట పెరిగింది.

నువ్వు సపోర్ట్ తో ఆడావ్ అంటే నువ్వు సపోర్ట్ తో ఆడావ్ అంటూ రెచ్చిపోయారు. వేలు చూపించి మాట్లాడుతున్న ఫైమాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు రేవంత్. కాసేపు రేవంత్ గేమ్ ని వెటకారం చేసిన ఫైమా రంగు కొట్టించుకుని కూడా ఆర్గ్యూమెంట్ చేసింది. ఇద్దరి మద్యలో పెద్ద మాటల యుధ్దం అయ్యింది. రోహిత్ ని స్ట్రాంగ్ అంటూ నామినేట్ చేశావ్, అంటే నువ్వు చాలా వీక్ అనే కదా అర్దం అలాంటోళ్లు హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ రేవంత్ పాయింట్ మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు వాదనకి దిగారు.

హౌస్ లో రేవంత్ ముందు ఒకటి, తర్వాత ఒకటి మాట్లాడతాడు ఇది ఎవరికీ కనిపించడం లేదా ? ఇవన్నీ చూడట్లేదా అంటూ హౌస్ మేట్స్ ని, అలాగే ఆడియన్స్ ని ఉద్దేశ్యించి ఊగిపోయింది ఫైమా. నిజానికి ఫైమా – రేవంత్ ఇద్దరిమద్యలో గత రెండు వారాలుగా వార్ నడుస్తునే ఉంది. లాస్ట్ టైమ్ కెప్టెన్ కాబట్టి రేవంత్ ని నామినేట్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు రావడంతో రేవంత్ రెచ్చిపోయాడు. ఆదిరెడ్డి – ఫైమా ఇద్దరూ కలిసి సపోర్ట్ గా ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం గేమ్ ఆడినప్పటి నుంచీ వీరిద్దరికీ పడట్లేదు.అందుకే, ఒకరిపై ఒకరు అరుచుకున్నారు అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus