RGV, NTR: సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు: ఆర్జీవీ

ఈరోజు హైదరాబాద్ లో ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఆ సినిమా టీడీపీ పార్టీకి మద్దతుగా ఉంది అని అంతా అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ కూడా చూడటానికి అలాగే ఉంది. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘రాజధాని ఫైల్స్’ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు కదా అని హడావిడిగా రాంగోపాల్ వర్మ .. వైసీపీకి అనుకూలంగా తీస్తున్న ‘వ్యూహం’ సినిమా ప్రెస్ మీట్..ను కూడా ఏర్పాటు చేశాడు.

ఇందులో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి సహజంగానే తిక్క సమాధానాలు ఇచ్చాడు వర్మ. ఇది ఊహించిన సంగతే. కానీ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వచ్చింది. దాని పై వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. 2023 డిసెంబర్ చివరి వారంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ వేశాడు . ‘సీనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడు లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్’ అనేది ఆ ట్వీట్ సారాంశం.

దాని గురించి ఈరోజు వర్మని మీడియా నిలదీసింది. ‘సంబంధం లేకుండా ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?’ అని ప్రశ్నించింది. దానికి వర్మ.. ‘అది వోడ్కా తాగి వేసిన ట్వీట్’ అని బోల్డ్ సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెబుతారు? అంటూ వర్మని మీడియా మళ్ళీ ప్రశ్నించింది. అందుకు వర్మ.. ‘నా దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు’ అంటూ తిక్క సమాధానం ఇచ్చాడు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus