టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద పోస్టుల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, మరి కొందరు సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి టాలీవుడ్ టికెట్ రేట్ల సమస్య గురించి చర్చించిన సంగతి తెలిసిందే. త్వరలో పెరిగిన టికెట్ రేట్లకు సంబంధించిన కొత్త జీవో అమలులోకి రానుందని చిరంజీవి వెల్లడించారు. టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించడం కోసం చిరంజీవి ఎంతో శ్రమించారు.
మహేష్ బాబు, రాజమౌళి సైతం చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయని చెప్పుకొచ్చారు. చిరంజీవి సమస్యకు పరిష్కారం చూపడంతో ఇండస్ట్రీలో ఆయన రేంజ్ పెరిగిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం గమనార్హం. అయితే వర్మ మాత్రం సోషల్ మీడియాలో తాను మెగా అభిమానినని మెగా ఫ్యాన్ గా మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ ను వర్మ కొంతసమయానికే ట్విట్టర్ నుంచి తొలగించారు.
టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అవుతున్న తరుణంలో ఇలాంటి ట్వీట్ల వల్ల సమస్య మరింత పెద్దదయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా ఇతర రాష్ట్రాల స్థాయిలో పెరగవని తెలుస్తోంది. హీరో, హీరోయిన్, దర్శకుడి రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు తొలి వారం టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. ఏపీలో టికెట్ ధరలు కనిష్టంగా 20 రూపాయలుగా గరిష్టంగా 250 రూపాయలుగా ఉండే అవకాశం ఉందని బోగట్టా.
ఏసీ థియేటర్లకు ఒక విధంగా ఏసీ లేని థియేటర్లకు మరో విధంగా టికెట్ రేట్లు ఉండనున్నాయి. త్వరలో ఏపీలో పెరిగిన టికెట్ రేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. టికెట్ రేట్లు పెరిగితే ఏపీలో పెద్ద సినిమాలు వరుసగా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
Though it happened because of SUPER, MEGA, BAHUBALI LEVEL BEGGING , I am glad that the OMEGA STAR @ysjagan has blessed them.. I tremendously appreciate the SUPER,MEGA,BAHUBALIni minchina MAHABAL @ysjagan 🙏 https://t.co/3oWTPGlG5u