Ram Gopal Varma: ఆర్జీవీపై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి ప్రేక్షకుల మధ్య తరచూ చర్చ జరుగుతుంది. వివాదాస్పద ట్వీట్ల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే వర్మ తాజాగా బన్నీని మెచ్చుకుంటూ మెగా హీరోలకు ఆగ్రహం తెప్పించేలా ట్వీట్లు చేశారు. బన్నీ నటించిన పుష్ప ది రైజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల బన్నీ చాలా సంతోషిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమేననే విషయం తెలిసిందే. ఆర్జీవీ మాత్రం అల్లు అర్జున్ ను మెగాస్టార్ అని సంబోధించడం చర్చకు దారి తీస్తోంది. స్టార్ హీరో అల్లు అర్జున్ కు ప్రస్తుతం సొంతంగా ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటు సక్సెస్ రేట్ ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోలలో బన్నీ కూడా ఒకరు. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మెగాస్టార్ అంటూ వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు.

పుష్ప మూవీతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడని మెగా ఫ్యామిలీలో టాప్ స్టార్ బన్నీ అని మెగాస్టార్ ఇకపై బన్నీ అంటూ వర్మ సంచలన ట్వీట్లు చేసి ఆ ట్వీట్లలో కొన్ని ట్వీట్లను డిలీట్ చేశారు. బన్నీ స్టైల్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం షేక్ అవ్వాల్సిందే అంటూ వర్మ చేసిన ట్వీట్లు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. ఆర్జీవీ చేసిన ట్వీట్లు మెగాభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

చిరంజీవి మాత్రమే మాకు మెగాస్టార్ అని మరే హీరో మెగాస్టార్ కాదని కొంతమంది చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వర్మ అనవసరంగా వివాదాలను సృష్టిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వర్మ వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని చాలామంది సూచిస్తున్నారు. మెగా కుటుంబాన్ని బన్నీ బంధువులుగా గుర్తుంచుకుంటారని మెగా కుటుంబంలో ఎవరినీ అల్లు అర్జున్ తో పోల్చలేమంటూ వర్మ షాకింగ్ కామెంట్లు చేయగా వర్మ చేసిన కామెంట్లపై బన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus